నారు పెంపకం

శ్రీ పద్ధతిలో 8-12 రోజుల నారును నాటతారు కాబట్టి నారుమడి తయారీలో, నారు పెంపకంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

మడి తయారీ

నారు మడి వెడల్పు ఒక గజం (4 అడుగులు) వుండాలి. అవసరాన్ని బట్టి, సౌకర్యాన్ని బట్టి పొడవును నిర్ణయించుకోవాలి.  ఎకరం పొలంలో నాటడానికి రెండు కిలోల విత్తనం సరిపోతుంది. దానికి 44 చదరపు గజాలు / 40౦ చదరపు అడుగుల నారుమడి కావాలి. వీలును బట్టి ఒకే పెద్దమడి కానీ, లేదా చిన్న మదులను గాని చేసుకోవచ్చు. కూరగాయలు, పొగాకునారుమడి మాదిరి ఎతైన మడులు తయారు చేయాలి. 8-12 రోజులలో వరి వేళ్ళు 3 అంగుళాలు పెరుగుతాయి కాబట్టి నారు మడి 5-6 అంగుళాల ఎత్తు వుండాలి.

నారు మడిని ఈ కింది విధంగా తయారు చేయాలి.

ఒకటవ పొర; ఒక అంగుళం బాగా చివికిన పశువుల ఎరువు

రెండవ పొర; ఒకటిన్నర అంగుళాల మట్టిమూడవ పొర ; ఒక అంగుళం బాగా చివికిన పశువుల ఎరువునాల్గవ పొర ; రెండున్నర అంగుళాల మట్టి

ఈ పోరాలన్నింటిని బాగా కలపాలి.

నారు మడి చుట్టూ కలవ తీయాలి. తడిమట్టి జారిపోకుండా అవసరమైతే నారు మడి చుట్టుతా చెక్కలు గానీ, వాసం బద్దలు కానీ, వరి ఎం ట్లు కానీ వుంచాలి.